సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

Aadhar Services In Grama Sachivalayam: కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా.? ఆధార్‌లో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా.? ఇలాంటివన్నీ కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది . కొత్త ఆధార్ కార్డులు జారీ, ఆధార్ కార్డుల్లో మార్పులు వంటి సేవలను […]

  • Ravi Kiran
  • Publish Date - 1:01 am, Sat, 18 July 20
సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

Aadhar Services In Grama Sachivalayam: కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా.? ఆధార్‌లో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా.? ఇలాంటివన్నీ కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది .

కొత్త ఆధార్ కార్డులు జారీ, ఆధార్ కార్డుల్లో మార్పులు వంటి సేవలను సచివాలయాల గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అవసరమైన ప్రదేశాల్లో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ఎక్కడెక్కడ ప్రారంభించాలన్న దానిపై అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.