జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?

AP Government: జగన్ సర్కార్‌కు ఈసీ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్నికల కమీషన్ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని.. స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అమలు చేయడానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. దీనితో మార్చి 25న చేపట్టిన ఈ కార్యక్రమం వాయిదా పడినట్లయింది. ఇదిలా ఉంటే 2020, […]

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?
Follow us

|

Updated on: Mar 14, 2020 | 2:10 PM

AP Government: జగన్ సర్కార్‌కు ఈసీ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్నికల కమీషన్ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని.. స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అమలు చేయడానికి వీలు లేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. దీనితో మార్చి 25న చేపట్టిన ఈ కార్యక్రమం వాయిదా పడినట్లయింది.

ఇదిలా ఉంటే 2020, మార్చి 07వ తేదీన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందేనని ఎన్నికల కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయొద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అటు నిబంధనల విషయంలో కూడా కఠినంగా ఉండాలని తెలిపారు. అయితే సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై యధావిధిగా సమీక్ష నిర్వహించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు. కాగా, పేదలకు ఇళ్ల పట్టాలను ఎప్పుడు పంపిణీ చేస్తారన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..