కౌలు రైతులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Bank Loans For Every Leasing Farmer: రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కేబినేట్ సమావేశంలో కౌలు రైతు రుణ పరిమితిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రతీ రైతుకు సకాలంలో బ్యాంక్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 8500 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న మంత్రి.. వాళ్ళందరికీ కూడా పంట సాగు హక్కు పత్రం ఇప్పించేలా […]

  • Updated On - 1:43 am, Thu, 16 July 20
కౌలు రైతులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Bank Loans For Every Leasing Farmer: రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కేబినేట్ సమావేశంలో కౌలు రైతు రుణ పరిమితిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రతీ రైతుకు సకాలంలో బ్యాంక్ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 8500 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న మంత్రి.. వాళ్ళందరికీ కూడా పంట సాగు హక్కు పత్రం ఇప్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

అటు కౌలు రైతులు, పాడి రైతులు, జాలర్లకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి ఆగష్టు 7 వరకు బ్యాంకు రుణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని.. కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కాగా, పొగాకు కొనుగోళ్లకు సీఎం జగన్ రూ. 200 కోట్లు కేటాయించారని కన్నబాబు వెల్లడించారు.