ఏపీ ప్ర‌జ‌లు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాలా..స్పెషల్ పాస్‌లకు ఇలా అప్లై చేసుకోండి..

అత్య‌వ‌స‌ర లేదా ముఖ్య‌మైన ప‌నుల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఏపీ ప్ర‌భుత్వం స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. కుటుంబ స‌భ్యుల‌ మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ, అత్యవసర వైద్య చికిత్స వంటి ప‌నుల కోసం మాత్ర‌మే ఈ పాసుల‌ను జారీ చేయ‌నున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచనలు చేసింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వివ‌రాల‌ను సమర్పించిన […]

ఏపీ ప్ర‌జ‌లు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాలా..స్పెషల్ పాస్‌లకు ఇలా అప్లై చేసుకోండి..
Follow us

|

Updated on: May 16, 2020 | 11:21 PM

అత్య‌వ‌స‌ర లేదా ముఖ్య‌మైన ప‌నుల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఏపీ ప్ర‌భుత్వం స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. కుటుంబ స‌భ్యుల‌ మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ, అత్యవసర వైద్య చికిత్స వంటి ప‌నుల కోసం మాత్ర‌మే ఈ పాసుల‌ను జారీ చేయ‌నున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచనలు చేసింది.

ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వివ‌రాల‌ను సమర్పించిన అనంత‌రం పోలీసువారు..ప‌ని ప్ర‌ధాన్య‌త‌ను బ‌ట్టి పాస్ ను ఆమెదిస్తారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వెహిక‌ల్ ఎమ‌ర్జెన్సీ పాస్‌ను పంపిస్తారు. ఈ మేర‌కు అత్యవసర పనుల నిమిత్తం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన‌వారు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. కొన్ని అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాలంటే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌నతో పోలీస్ శాఖ ఈ పాస్‌ల జారీకి అవ‌కాశం ఇచ్చింది. ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిస‌రి అని సూచించింది.

పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

1) పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

2) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్

3) ప్రయాణించేవారి వివరాలు

4) మెయిల్ ఐడీ

5) మొబైల్ నంబర్

6) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు

7) వాహనానికి సంబంధించిన వివరాలు

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు