ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jul 29, 2020 | 3:36 PM

ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

AP Government Provides Whatsapp Numbers: ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ పేషెంట్లకు అరగంటలో బెడ్ కేటాయించాలని చెప్పడమే కాకుండా.. ఎవరైనా నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది. అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. ఆ వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం – 7995225220, విజయనగరం – 9491012012, విశాఖపట్టణం – 9000782783, తూర్పు గోదావరి – 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ – 9100997444, గుంటూరు – 9121008008, ప్రకాశం – 9063455577, నెల్లూరు – 9704501001, చిత్తూరు – 9491077099, అనంతపురం – 9493188891, కడప – 9849900960, కర్నూలు – 9849902412.

నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..

  • AMC, విశాఖపట్నం – 92466 16864
  • SMC, విజయవాడ – 98484 36653
  • SVIMS, తిరుపతి – 94935 47709
  • GMC, అనంతపురం – 98494 99761
  • GMC (RIMS), కడప – 92478 99544

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu