హైకోర్టులో పిటీషన్ వేసిన కోడెల కుమార్తె

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధికారం కోల్పోడంతో..అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటంబంపై తీవ్ర స్థాయిలో అవినీతి విమర్శలు వచ్చాయి. తమకు జరిగిన అక్రమాలపై భారీగా భాదితులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. ‘కే’ ట్యాక్స్ పేరుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నామని వారు పోలీసుల ముందు వాపోయారు. దీంతో కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని .. కోడెల శివప్రసాదరావు కుమార్తు విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌ […]

హైకోర్టులో పిటీషన్ వేసిన కోడెల కుమార్తె
Follow us

|

Updated on: Jul 13, 2019 | 8:10 PM

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధికారం కోల్పోడంతో..అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటంబంపై తీవ్ర స్థాయిలో అవినీతి విమర్శలు వచ్చాయి. తమకు జరిగిన అక్రమాలపై భారీగా భాదితులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. ‘కే’ ట్యాక్స్ పేరుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నామని వారు పోలీసుల ముందు వాపోయారు. దీంతో కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని .. కోడెల శివప్రసాదరావు కుమార్తు విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రీసెంట్‌గా నరసరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ విజయలక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయలక్ష్మీపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు.

2014లో సివిల్ భూ తగాదా విషయంలో ఇప్పుడు ఫిర్యాదు చేయడం.. కేసు పెట్టడం రాజకీయ ప్రేరేపితం అని కోడెల కుమార్తె తరుపు న్యాయవాది వాదించారు. మొత్తం ఎనిమిది మంది నిందితులుంటే ఆమెపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది.