సర్కారుకి చెడ్డపేరు తీసుకురావాలన్నదే ఎస్ఈసీ లక్ష్యం, నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం నాకు లేదు : వెంకట్రామిరెడ్డి

నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం నాకు లేదన్నారు ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య జరుగుతోన్న పోరులో..

  • Venkata Narayana
  • Publish Date - 12:21 pm, Sun, 24 January 21
సర్కారుకి చెడ్డపేరు తీసుకురావాలన్నదే ఎస్ఈసీ లక్ష్యం, నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం నాకు లేదు : వెంకట్రామిరెడ్డి

నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం తనకు లేదన్నారు ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య జరుగుతోన్న పోరులో ఉద్యోగులు బలవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్నదే రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యమని ఆయన ఆరోపించారు. తన మాటల్ని వక్రీకరించారని చెప్పిన ఆయన, తాము ఎవరినీ బెదిరించలేదు.. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలను భ్రష్టుపట్టించింది గతప్రభుత్వమేనని,  ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి కూడా నమ్మకంలేదని ఆయన అన్నారు.