ఏపీ క‌రోనా అప్‌డేట్స్ : జిల్లాల వారీగా

ఏపీ క‌రోనా అప్‌డేట్స్ : జిల్లాల వారీగా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు మార్క్ దాటాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది.

Ram Naramaneni

|

Aug 07, 2020 | 8:04 PM

AP Corona Cases : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు మార్క్ దాటాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్త‌గా 89 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 1,842 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలో వ్యాధి నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,654 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో 62,938 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 23.62 లక్షల మందికి కరోనా టెస్టులు చేసిన‌ట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త‌గా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1,270 అనంతపురంలో 1,100 చిత్తూరులో 980 నెల్లూరులో 941 విశాఖలో 852 గుంటూరులో 817 కడపలో 596 పశ్చిమగోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.

గ‌డిచిన 24 గంటల్లో క‌రోనాతో ఏయే జిల్లాల్లో ఎంత మంది మ‌ర‌ణించారంటే..

చిత్తూరు జిల్లాలో కరోనాతో మరో 10 మంది చ‌నిపోయారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. కడప, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు చొప్పున చ‌నిపోయారు. కృష్ణా జిల్లాలో 6, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు.

Read More : యువ‌తి క‌డుపులో 1.5 కిలోల జుట్టు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu