గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు సెప్టెంబర్‌లో ముగించాలి..

గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. వాటి కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు సెప్టెంబర్‌లో ముగించాలి..
Follow us

|

Updated on: Aug 10, 2020 | 10:53 PM

Review On Village And Ward Secretariats: గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. వాటి కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రజల సమస్యలు సకాలంలో పూర్తయ్యేలా ఈ పీఎంయూ దిశానిర్దేశం చేస్తుందన్నారు. మొదటిగా నాలుగు సర్వీసులను అమలు చేయనుండగా.. అక్టోబర్ కల్లా 543కి పైగా సేవలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని సీఎం ప్రారభించారు. తాజాగా క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్షను నిర్వహించారు.

అటు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షల ప్రక్రియను సెప్టెంబర్‌లో ముగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ కార్యక్రమాలపై శిక్షణ, సంక్షేమ పధకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇదిలా ఉంటే వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సచివాలయాల్లో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రారంభించనున్న పధకాలు, వాటి మార్గదర్శకాలు ప్రజలకు చేరువయ్యేలా ఉంచాలన్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే సమయంలో పరిష్కారమయ్యేలా ప్రణాళికను సిద్దం చేయమని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Also Read:

ఏపీ: ఆ మూడు లక్షణాలున్నా ఆసుపత్రిలో చేరొచ్చు..

రూ. 2000 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బీఐ..

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..