జగనన్న పెద్ద మనసు.. కిడ్నీ రోగికి చేయూత..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేసి..

  • Publish Date - 1:56 pm, Sat, 5 September 20
జగనన్న పెద్ద మనసు.. కిడ్నీ రోగికి చేయూత..

YS Jagan Help: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేసి.. అతడి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో నివసిస్తున్న రేవంత్ కుమార్‌ అనే బాలుడు గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అతడి పరిస్థితిని శాసనసభ్యుడు జోగి రమేష్ పట్టణ వైసీపీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు‌. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం రూ. 10 లక్షలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్‌ను జోగి రమేష్ శుక్రవారం ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు. కాగా, కష్టకాలంలో ఆర్ధిక సాయం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు, ఎమ్మెల్యేలకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..