మోదీ గారూ.. మందాకిని మాకే.. జగన్ ఉద్దేశమేంటంటే ?

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానికి లేఖ రాశారంటే అది ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాల కోసమే అన్నది ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తాజా లేఖ కూడా అందుకే రాశారు. కాకపోతే అది మందాకిని కోసం. జగన్ లేఖలో చాలా క్లియర్‌గా  రాసిన అంశం ఏంటంటే.. ‘‘మందాకినిని మాకే ఇవ్వాలి మోదీ గారు..’’ ఇదే లేఖను జగన్ కార్యాలయం మీడియాకు కూడా విడుదల చేసింది. ఇంతకీ మందాకిని ఎవరు ? […]

మోదీ గారూ.. మందాకిని మాకే.. జగన్ ఉద్దేశమేంటంటే ?
Rajesh Sharma

|

Nov 05, 2019 | 6:02 PM

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానికి లేఖ రాశారంటే అది ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాల కోసమే అన్నది ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తాజా లేఖ కూడా అందుకే రాశారు. కాకపోతే అది మందాకిని కోసం. జగన్ లేఖలో చాలా క్లియర్‌గా  రాసిన అంశం ఏంటంటే.. ‘‘మందాకినిని మాకే ఇవ్వాలి మోదీ గారు..’’ ఇదే లేఖను జగన్ కార్యాలయం మీడియాకు కూడా విడుదల చేసింది. ఇంతకీ మందాకిని ఎవరు ? మాకే ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రికి లేఖ రాయడమేంటి ? అనుకుంటున్నారా ? రీడ్ దిస్ స్టోరీ..
ఏపీ రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ కలిపి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మొత్తం 5010 మెగావాట్ల విద్యుత్ లభ్యమవుతుందిద. సింగరేణి కోల్ కాలరీస్, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఏపీలోని జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ నుంచే సరఫరా అయ్యేది.
రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించారు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గుపైనే ఏపీలోకి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం భరోసా ఇచ్చిన 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు బొగ్గు కొరత తీవ్ర అవరోధంగా మారింది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిల్వలున్నాయి. ఐబీ వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిక్షేపాలున్నాయి.
ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీ కి కేటాయించారు. ప్రతీ గని నుంచి 5ఎంఎంటీఏలు తీసుకోవచ్చని ఏపీ సర్కార్‌కు తెలిపారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణ వ్యయం భారంగా మారింది.
ఒడిశాలోని తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌కు కేటాయించాలని ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత  బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వచ్చే వేసవి నాటికి ఏ మాత్రం సరిపోదు. కచ్చితంగా అదనపపు ఉత్పత్తి జరపాల్సిన అవసరం వుంది. దానికి అదనంగా బొగ్గు కేటాయింపులు అవసరం కావడంతో మందాకిని బొగ్గు గనిని ఏపీకి కేటాయించాలని జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. 2015 బొగ్గు గనుల చట్టం ప్రకారం ఏపీ జన్‌కో వినియోగం ట్రాంచీ-06ను కేంద్రం ఏపీకి కేటాయించింది. ఇపుడు అదనపు ఉత్పత్తి కోసం ప్రతీ సంవత్సరం 7.5 ఎంఎంటిఏల బొగ్గు నిల్వలు అవసరం కానున్నాయి. ఇందుకోసం మందాకిని బొగ్గుగనిని వీలైనంత త్వరగా ఏపీకి కేటాయించాలని జగన్ తన లేఖలో మోదీని కోరారు.
 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu