నా కులమతాలు ఇవే.. జగన్ భావోద్వేగం.. చప్పట్లు కొట్టిన జనం

నా కులమతాలు ఇవే.. జగన్ భావోద్వేగం.. చప్పట్లు కొట్టిన జనం

తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం.. కులం మాట నిలుపుకునే కులం అని జగన్ స్పష్టం చేశారు. గుంటూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన జగన్ అనంతరం మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన మతం, కులంపై వస్తోన్న ఆరోపణలు చూసి బాధేస్తోందన్న జగన్.. ‘‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలుపుకునే కులం’’ అని అన్నారు. దీంతో అక్కడున్న అందరూ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 02, 2019 | 7:10 PM

తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం.. కులం మాట నిలుపుకునే కులం అని జగన్ స్పష్టం చేశారు. గుంటూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన జగన్ అనంతరం మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన మతం, కులంపై వస్తోన్న ఆరోపణలు చూసి బాధేస్తోందన్న జగన్.. ‘‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలుపుకునే కులం’’ అని అన్నారు. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.

రాష్ట్రంలో పాలనపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నానని.. మంచి పరిస్థితిని చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అనారోగ్యం కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదన్నది తన అభిమతమని జగన్ అన్నారు. ఆరోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను మే నాటిని భర్తీ చేస్తామని.. జనవరి నుంచి కేన్సర్ రోగులకు సంబంధించి అన్ని రకాల చికిత్సకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని వెల్లడించారు.

జగన్ మరో గుడ్‌ న్యూస్ ఏపీ ప్రజలకు జగన్ మరో గుడ్‌ న్యూస్ ప్రకటించారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయనున్నామని చెప్పిన జగన్.. ఆరోగ్యశ్రీ ద్వారా 2వేల రోగాలకు చికిత్స తీసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా శస్త్రచికిత్స చేసుకున్న వారికి నెలకు రూ. 5వేల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామని.. డిసెంబర్ 15 నాటికి 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.

అయితే జగన్ కుల, మతాలపై విపక్షాల నేతలు గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పలుమార్లు జగన్ మతంపై కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడి, విపక్షాలందరికీ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu