ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ… ఆ వివరాలను అందించేందుకు ఆరోగ్య శ్రీ హెల్ప్‌ డెస్క్‌

ఈ వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడం పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు...

ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ... ఆ వివరాలను అందించేందుకు ఆరోగ్య శ్రీ హెల్ప్‌ డెస్క్‌

Aarogyasri Help Desk :  ప్రజారోగ్యానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తోంది. పేదవాడికి ముఖ్యమైన వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్నో మార్పులు చేసిన ప్రభుత్వం.. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఈ పథకం వర్తింప చేస్తోంది. ఇందులో భాగంగా మరో ముఖ్యమై ఏర్పాటు చేసింది. ఆస్పత్రికి వెళ్లిన ప్రతి పేదవాడికి ఆరోగ్య శ్రీ వివరాలను అందించేందుకు ఆరోగ్య మిత్రలు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఈ వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడం పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌వోపీ ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.