రేపు అంతర్రాష్ట్ర సర్వీసులపై మరోసారి చర్చలు..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు గతవారం విజయవాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక రేపు మరోసారి హైదరాబాద్‌లో చర్చించనున్నారు. వాస్తవానికి చర్చలు ఇవాళ జరగాల్సి ఉండగా.. అది కాస్తా రేపటికి వాయిదా పడింది. రెండు రాష్ట్రాల మధ్య నాలుగు దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు గత వారం జరిగిన ప్రాధమిక చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు జరగనున్న సమావేశంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల […]

  • Updated On - 1:40 pm, Tue, 23 June 20
రేపు అంతర్రాష్ట్ర సర్వీసులపై మరోసారి చర్చలు..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు గతవారం విజయవాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక రేపు మరోసారి హైదరాబాద్‌లో చర్చించనున్నారు. వాస్తవానికి చర్చలు ఇవాళ జరగాల్సి ఉండగా.. అది కాస్తా రేపటికి వాయిదా పడింది.

రెండు రాష్ట్రాల మధ్య నాలుగు దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు గత వారం జరిగిన ప్రాధమిక చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు జరగనున్న సమావేశంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల నిర్వహణపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సు సర్వీసులు తిప్పాలి.. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు తిప్పాలన్న విషయాలను చర్చించి అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు.