వెబ్‌ సిరీస్‌కు నో చెప్పిన స్వీటీ..

ఓటీటీలలోని వెబ్‌ సిరీస్‌లకు ఈ మధ్యకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనితో బడా హీరోలు, హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

వెబ్‌ సిరీస్‌కు నో చెప్పిన స్వీటీ..

Anushka Shetty Rejects Web Series Offer: కరోనా వైరస్ మొత్తాన్ని మార్చేసింది. ముఖ్యంగా సినీ రంగాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. విడుదలకు సిద్దమైన చిన్నా, పెద్ద సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. అంతేకాకుండా షూటింగులు లేక జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్నది ఎవరికీ తెలియట్లేదు.! ఈ తరుణంలో చాలామంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

అటు ఓటీటీలలోని వెబ్‌ సిరీస్‌లకు ఈ మధ్యకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనితో బడా హీరోలు, హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి ఛాన్స్ ఒకటి స్వీటీ అనుష్క శెట్టి దగ్గరకు వస్తే.. ఆమె సున్నితంగా నో చెప్పిందని టాలీవుడ్ టాక్. ఓ బడా నిర్మాణ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో భారీ వెబ్‌ సిరీస్‌కు ప్లాన్ చేశారట. ఇందులో భాగంగానే ఆమెను సంప్రదించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే అనుష్క మాత్రం ఆ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు నో చెప్పిందని సమాచారం.

Click on your DTH Provider to Add TV9 Telugu