అమెరికాలో కొనసాగుతున్న కరోనా టీకా అత్యవసర వినియోగం.. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సినేషన్ః ఫౌచీ

అమెరికాలో రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా అమెరికా పయనిస్తోందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ వెల్లడించారు.

అమెరికాలో కొనసాగుతున్న కరోనా టీకా అత్యవసర వినియోగం.. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సినేషన్ః ఫౌచీ
Follow us

|

Updated on: Jan 06, 2021 | 10:01 PM

కరోనా వైరస్ ప్రకోపానికి అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. అమెరికన్లు రికార్డు స్థాయిలో మహమ్మారి బారినపడుతున్నారు. వేలాది మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ మీడియాతో మాట్లాడారు. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా అమెరికా పయనిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రోజు ఐదు లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందుతున్నట్టు ఆయన చెప్పారు. ‘భారీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు చిన్న చిన్న అవాంతరాలు రావడం సహజం. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి వంద రోజుల్లోనే 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించేలా పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఫౌచీ అన్నారు.

అంతేకాకుండా సుమారు 70-85శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తేనే హర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం అవుతుందని ఫౌచీ అశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, అమెరికా వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 2.27లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే కోవిడ్ బారినపడి 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2.15కోట్లకు చేరగా.. 3.65లక్షల మంది మృత్యువాతపడ్డారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??