AP Cm YS Jagan: ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ.. వరద సహాయం కింద 1000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి

AP Cm YS Jagan: ఏపీలో భారీ ఎత్తున వరదలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో..

AP Cm YS Jagan: ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ.. వరద సహాయం కింద 1000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి
Follow us

|

Updated on: Nov 24, 2021 | 11:58 AM

AP Cm YS Jagan: ఏపీలో భారీ ఎత్తున వరదలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వరద సహాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నష్టానికి సంబంధించిన నివేదికను లేఖతో పంపించారు. వరదల నష్టంపై అంచనాకు కేంద్ర నుంచి బృందాలను పంపాలని జగన్‌ లేఖలో కోరారు.

మరో వైపు సీఎం జగన్‌ వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కడప, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వరద నష్టం, ప్రాణ నష్టం తదితర వివరాలపై ఆరా తీశారు. అయితే మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు జగన్‌. బాధితులకు అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

AP Rains: భారీ వర్షాల నుంచి తేరుకున్న అనంతపురం జిల్లా.. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మత్తులు..

Tomato Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. పెట్రోల్‌ను దాటేసిన టమాటా ధర కిలో రూ.140..