Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..

కూలీ పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యువు కబళించింది.

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
Road Accident
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 23, 2024 | 8:01 PM

కూలీ పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పనులు ముగించుకొని ఆటోలో తిరిగి వస్తుండగా.. తలకాసి పల్లి క్రాస్ వద్ద వేగంగా వచ్చి ఢీకొంది.

పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కూలీలు తెల్లవారుజామున అరటి తోటలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కూలీల బతుకులను ఛిద్రం చేసింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ… బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ నలుగురిని మెరుగైన చికిత్స కోసం అధికారులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వీడియో చూడండి..

మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు.. ఓకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు కన్నీరు పెట్టించింది. మృతులు తాతయ్య, చిన్న నాగమ్మ, రామాంజునమ్మ, పెద్ద నాగమ్మ, చిన్న నాగన్న, కొండమ్మ, జయరాం గా పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!