Sand Policy: నూతన ఇసుక పాలసీలో సవరణలు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇక నుంచి వారికి మాత్రమే..

Sand Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది.

Sand Policy: నూతన ఇసుక పాలసీలో సవరణలు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఇక నుంచి వారికి మాత్రమే..
Sand Policy
Follow us

|

Updated on: Apr 17, 2021 | 8:29 AM

Sand Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ఇకపై ఇసుక కావాలనుకునే వారు నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు ఆఫ్‌లైన్‌ ద్వారా ఇసుక విక్రయాలు జరుపాలని స్పష్టం చేసింది. ఎవరైనా నేరుగా ఇసుక రీచ్, స్టాక్ యార్డ్‌కు వెళ్లి.. ఇసుక నాణ్యతను పరిశీలించుకున్న తరువాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చునని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కొనుగోలుదారులు తమ సొంత వాహనాల్లో గానీ, కాంట్రాక్టర్‌కు సంబంధించిన వాహనాలతో గానీ ఇసుకను తీసుకెళ్లవచ్చని పేర్కొంది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే కాంట్రాక్టర్ ఇసుకను విక్రయించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదిలాఉంటే.. ఇసుక రీచ్ సమీప గ్రామాల్లోని ప్రజలు ఎడ్ల బళ్లతో తీసుకెళ్లే ఇసుకకు మాత్రమే ఉచిత అవకాశం కల్పించారు. గతంలో ఇసుక రీచ్ ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ జాబితా నుంచి ట్రాక్టర్‌ను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు.. ఇసుక కాంట్రాక్టర్.. ప్రతీ రీచ్‌కు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది.

అలాగే.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ యార్డులో ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఇక ఇసుక కొనుగోలు చేసే ప్రతీ కొనుగోలు దారుకు సంబంధిత బిల్లులు, వాహనం నెంబర్‌తో సహా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాల విషయంలో గనుల శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలంది. ఇక ఇసుక రీచ్ కాంట్రాక్ట్ పట్టిన కాంట్రాక్టర్.. ఇసుకను రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులకు, పేదల గృహ నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఇసుక పాలసీలో సవరణలకు సంబంధించి ఉత్తర్వులను ప్రతి జిల్లా కలెక్టరేట్‌కు పంపించారు.

Also read:

West Bengal Assembly Election 5th Phase LIVE: మొదలైన వెస్ట్‌ బెంగాల్‌ ఐదో విడత ఎన్నికల పోలింగ్‌.. ఉదయం నుంచే..

Mahesh Babu: మొదలైన సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ పనులు… ( వీడియో )

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ నిషేధం
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!