కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 1,916 కొత్త కేసులు.. 43 మరణాలు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1916 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో స్థానికంగా 1,908 ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 2:19 pm, Tue, 14 July 20
కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 1,916 కొత్త కేసులు.. 43 మరణాలు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1916 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో స్థానికంగా 1,908 ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,019కి చేరింది.  ఇక 24 గంటల్లో 952 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ అయిన వారి సంఖ్య 17,467కు చేరింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 43 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 15,144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో మొత్తం చేసిన కరోనా పరీక్షల సంఖ్య 11,62,747కు చేరింది.

ఇదిలా ఉంటే ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.