‘వశిష్ఠ పున్నమి’ బోటు యజమాని అరెస్టు!

'వశిష్ఠ పున్నమి' బోటు యజమాని అరెస్టు!

గోదావరి నదిలో ఆదివారం నాడు జరిగిన పడవ ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు, బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు.  అతడితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్… వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మొత్తం 75 మందిని పడవలో […]

Ram Naramaneni

|

Sep 20, 2019 | 9:22 PM

గోదావరి నదిలో ఆదివారం నాడు జరిగిన పడవ ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు, బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు.  అతడితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్… వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

మొత్తం 75 మందిని పడవలో ఎక్కించుకుని గోదావరిలో సాధారణంగా వెల్ళవలసిన ఎడమ వైపు ఒడ్డు నుండి కాకుండా నిర్లక్ష్యంగా నది మధ్యలో నుంచి నడిపి 34 మంది యాత్రికుల మరణానికి, ముగ్గురు సిబ్బందితో కలిపి 15 మంది గల్లంతు కావడానికి కారణమైన బోటు యాజమాన్యం మీద కేసు నమోదైంది.

ఈ ప్రమాదంలో 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు, జాలర్లు కాపాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పడవ మునిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా అత్యాశతో, నైపుణ్యం లేని డ్రైవర్లతో పాపికొండల విహారయాత్రకు లాంచీని నడపడం ద్వారా యజమానులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. బోటు ఆచూకీ గుర్తించారు. దానికి బయటకు తీసేందుకు సాంకేతిక బృందాలతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏలూరు రేంజ్ డిఐజి ఎఎస్ ఖాన్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ ఆదేశాల ప్రకారం జాడ తెలియని వారి గురించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu