వాతావరణ హెచ్చరిక.. మరో నాలుగు రోజులు గడ్డకట్టే చలి.. పశ్చిమ హిమాలయాల మీదుగా ఈదురు గాలులు

పశ్చిమ హిమాలయ ప్రాంతం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు గజ గజ వణికిపోతున్నాయి.తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

వాతావరణ హెచ్చరిక.. మరో నాలుగు రోజులు గడ్డకట్టే చలి.. పశ్చిమ హిమాలయాల మీదుగా ఈదురు గాలులు
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Dec 24, 2020 | 4:37 AM

పశ్చిమ హిమాలయ ప్రాంతం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి.తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏపీలోని గూడెంకొత్త వీధిలో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.రాత్రి వేళ మరీ దారుణంగా 2, 3 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ చలి తీవ్రంగా అధికంగా ఉంది.ఆకాశం నిర్మలంగా ఉండడం, వర్షాలు లేకపోవడంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తూర్పు, ఈశాన్య గాలుల వల్ల రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం నందిగామలో 12.9, కళింగపట్నంలో 13.7, విశాఖపట్నంలో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దీంతో అక్కడ చలి తీవ్రంగా అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పినదాని ప్రకారం.. ఈ చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందన్నారు. చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులు పాటు ఉంటుందని ఆయన వెల్లడించారు.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలోచలి తీవ్రత అధికంగా ఉంది. చింతపల్లిలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక లంబసింగి‌లో అయితే దారుణంగా 1 నుండి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ చివరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు..తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలు చలితో గడ్డకట్టుకుపోతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 3.8 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక..హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మధ్యహ్నం సమయంలోనూ చల్లని గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్‌లో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. సాధారణం కన్నా 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత.. హయత్‌నగర్‌లో అత్యధికంగా 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.