స్వచ్ఛమైన గాలి కోసం సూపర్ స్టెప్స్

ఏపీలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం కోసం మూడు కమిటీలను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఆరుగురు సభ్యులతో మొత్తం మూడు కమిటీలు ఏర్పాటు చేశారు.

స్వచ్ఛమైన గాలి కోసం సూపర్ స్టెప్స్
Follow us

|

Updated on: Jun 11, 2020 | 3:13 PM

ఏపీలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం కోసం మూడు కమిటీలను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఆరుగురు సభ్యులతో మొత్తం మూడు కమిటీలు ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీ, మానిటరింగ్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఏడాది స్వచ్చమైన గాలి అందుబాటులో లేని 102 నగరాలను కేంద్ర కాలుష్య నివారణ మండలి గుర్తించింది. ఆయా నగరాల్లో స్వచ్ఛమైన గాలి లభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కాలుష్య పూరిత నగరాల జాబితాలో ఏపీ నుండి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలను కాలుష్య నివారణ మండలి పేర్కొంది. ఈ నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

కేంద్ర కాలుష్య నివారణ మండలి మార్గదర్శకాల ఆధారంగా చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 నగరాలను గుర్తించి క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం అమలు చేయాలని సర్కార్ తలపెట్టింది. ఇందుకోసం మూడు కమిటీలను గురువారం నియమించింది. ఈ కమిటీల సిఫారసుల మేరకు ఆయా నగరాల్లో కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.

Read full details here: 2020EFST_RT46