వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

రాష్ట్రంలో కరోనాతో చ‌నిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక‌ సాయం చేయాలని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలి‌సిందే. తాజాగా అందుకు సంబంధించిన జీవోను ఏపీ స‌ర్కార్ జారీ చేసింది.

వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

Funeral Charges For Corona Deaths : రాష్ట్రంలో కరోనాతో చ‌నిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక‌ సాయం చేయాలని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలి‌సిందే. తాజాగా అందుకు సంబంధించిన జీవోను ఏపీ స‌ర్కార్ జారీ చేసింది. కరోనాతో ప్రాణాలు విడిచివ‌ర‌ వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కింద‌ రూ.15వేలు అందించ‌నున్నారు. ఈ మేరకు జీవో జారీ చేసిన‌ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు వెంట‌నే రిలీజ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌‌కు సూచించారు.

కాగా రాష్ట్రంలో ప్లాస్మా దానం చేసిన వారికి రూ. 5 వేలు అందివ్వాల‌ని మరో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని సీఎం జ‌గ‌న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించి క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు అందాయి. ప్లాస్మా థెరపీపై ప్రజల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, దీని వ‌ల్ల‌ మంచి రిజ‌ల్ట్స్ ఉంటే క‌రోనాపై విజయం సాధించ‌న‌వ‌వారిని ప్రొత్స‌హించేలా చూడాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారులకు సూచించారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ. 5,000 ప్రోత్సాహకంగా ఇవ్వడం వ‌ల్ల‌..వారు మంచి భోజనం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది సీఎం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కూడా జీవో విడుద‌ల అయ్యింది.

Click on your DTH Provider to Add TV9 Telugu