విశాఖ, అనంతపురం జిల్లాలో మిడతల కలకలం..!

అనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు దాడి చేసింది. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై మిడతలు అలుముకుని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ నుంచి మిడతల దాడి జరుగుుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. మిడతల దాడి సర్వసాధారమంటున్నారు వ్యవసాయ నిపుణులు. అయితే.. పురుగుమందులు కలిపిన నీటిని ట్రాక్టర్లు, ఇతర మార్గాల […]

విశాఖ, అనంతపురం జిల్లాలో మిడతల కలకలం..!
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 5:09 PM

అనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు దాడి చేసింది. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై మిడతలు అలుముకుని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ నుంచి మిడతల దాడి జరుగుుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. మిడతల దాడి సర్వసాధారమంటున్నారు వ్యవసాయ నిపుణులు. అయితే.. పురుగుమందులు కలిపిన నీటిని ట్రాక్టర్లు, ఇతర మార్గాల ద్వారా చల్లడం కొంతమేర ప్రయోజనం చూపిస్తుందంటున్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. మిడతల దండును ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అటు విశాఖ జిల్లాకు పాకింది మిడతల బెడద. కసింకోట మండలం గోకివాని పాలెం లో జీడి మామిడి కొమ్మలపై మిడతాల దండు దాడి చేసింది. దీంతో మిడతలు పంట పొలాలను ఎంతమేర నష్టాన్ని కలిగిస్తాయోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారులు గోకివాని పాలె౦కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu