‘వాల్మీకి’తో వార్‌కు ‘బందోబస్త్’ సిద్ధం!

'వాల్మీకి'తో వార్‌కు 'బందోబస్త్' సిద్ధం!

ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం ఈ మధ్య టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. కొందరు స్టార్ హీరోలు కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని వెనక్కి తగ్గుతుంటే.. మరికొందరు కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బాక్స్ ఆఫీస్ వార్‌కు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలానే ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ సమరానికి సిద్ధమయ్యాయి. అందులో ఒకటి వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ చిత్రం కాగా మరొకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘బందోబస్త్’. నిజానికి ‘వాల్మీకి’ సెప్టెంబర్ […]

Ravi Kiran

|

Sep 18, 2019 | 4:35 PM

ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం ఈ మధ్య టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. కొందరు స్టార్ హీరోలు కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని వెనక్కి తగ్గుతుంటే.. మరికొందరు కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో బాక్స్ ఆఫీస్ వార్‌కు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలానే ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ సమరానికి సిద్ధమయ్యాయి. అందులో ఒకటి వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ చిత్రం కాగా మరొకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘బందోబస్త్’.

నిజానికి ‘వాల్మీకి’ సెప్టెంబర్ 13న విడుదల కావాల్సి ఉంది. అయితే నాని ‘గ్యాంగ్ లీడర్’తో పోటీ ఎందుకని.. వారం ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది. సోలోగా దండయాత్ర చేద్దామనుకున్న వరుణ్ తేజ్‌కు తమిళ హీరో సూర్య గట్టి పోటీని ఇచ్చేలా ఉన్నాడు. దర్శకుడు కె.వి.ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘బందోబస్త్’ సినిమాలో సూర్య అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. మోహన్ లాల్, ఆర్య, బోమన్ ఇరానీ, సైయేషా సైగల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా సూర్యకు తెలుగులో మార్కెట్ ఉండటంతో ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఖచ్చితంగా ‘వాల్మీకి’ చిత్రంపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక ‘వాల్మీకి’ విషయానికి వస్తే.. తమిళ హిట్ ‘జిగర్తాండా’కు రీమేక్‌గా తెరకెక్కింది. వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సూర్య ‘బందోబస్త్’ ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu