అమితాబ్‌ దాతృత్వం.. లక్ష మంది సినీ కార్మికులకు రేషన్‌

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌

  • Tv9 Telugu
  • Publish Date - 1:27 pm, Mon, 6 April 20
అమితాబ్‌ దాతృత్వం.. లక్ష మంది సినీ కార్మికులకు రేషన్‌

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముందుకొచ్చారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందజేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సోనీ పిక్చర్స్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ స్వాగతించాయి. కరోనా నియంత్రణకు కేంద్ర మానవ వనరుల శాఖ కింద ఉన్న 28 విభాగాలు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 38 కోట్ల విరాళం ప్రకటించాయి.

కాగా.. కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తన నెల వేతనం, ఎంపీల్యాడ్‌ నిధుల నుంచి రూ. కోటి విరాళం ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది రూ. 10 కోట్లు, నవోదయ పాఠశాలలు రూ. 7.5 కోట్లు విరాళం ఇచ్చాయి. ఇండియన్‌ బ్యాంకు ఉద్యోగులు 43 వేల మంది రూ. 8.10 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళం అందజేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రతీరోజు లక్ష మందికి ఆహారం అందజేస్తున్నామని జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తెలిపారు.