ఫ్యాన్స్‌కి బికినీతో షాక్ ఇచ్చిన అమితాబ్

ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఓ హాస్య భరిత ఫోటోను పోస్ట్ చేశారు బిగ్‌బి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అటు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూనే..

ఫ్యాన్స్‌కి బికినీతో షాక్ ఇచ్చిన అమితాబ్
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 4:26 PM

ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఓ హాస్య భరిత ఫోటోను పోస్ట్ చేశారు బిగ్‌బి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అటు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూనే.. మరోవైపు తనకి కెరీర్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆయన నటించిన ‘మహాన్’ అనే సినిమా ఈ రోజుతో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆ సినిమాకి సంబంధించిన ఓ ఫన్నీ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు దీనితో పాటు ఓ జోక్‌ని సైతం ఆయన జోడించారు.

‘ప్రజెంట్ జనరేషన్ చాలా మందికి ఎక్కువగా ఫాలోవర్లు ఉంటున్నప్పుడు నీకు ఎందుకు ఉండటం లేదు? బహుశా నువ్వు ఇన్నర్ దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయకపోవడమే కారణమంటూ కొంతమంది నాతో అన్నారు. అప్పుడే ఈ ఫొటోను నేను పోస్ట్ చేశా. త్రిపాత్రాభినయం చేసిన ‘మహాన్’ సినిమా విడుదలై నేటికి 37 ఏళ్లయింది’ అని తెలిపారు బిగ్ బి. అలాగే ఆ షూటింగ్ సమయంలో తన చేతికి గాయమైనట్లు కూడా తెలిపారు అమితాబ్ బచ్చన్.

Read More: 

గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి