Amitabh Bachchan: ఇంట్లో ఫ్యాన్లు మీరే శుభ్రం చేస్తారా.. కేబీసీలో బిగ్‌బీని ఇంటర్వ్యూ చేసిన కంటెస్టెంట్‌..

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..

Amitabh Bachchan: ఇంట్లో ఫ్యాన్లు మీరే శుభ్రం చేస్తారా.. కేబీసీలో బిగ్‌బీని ఇంటర్వ్యూ చేసిన కంటెస్టెంట్‌..

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మార్చే ఈ టీవీషోకు ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలామంది కలలు కంటుంటారు. ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న కేబీసీ తాజా సీజన్‌ ఇటీవల ప్రారంభమైంది. ఇక హోస్ట్‌ అమితాబ్‌ ఈ గేమ్‌షోను ఆసక్తికరంగా మలచడంతో బాగా విజయవంతమయ్యారు. కేవలం ప్రశ్నలు- సమాధానాలే కాకుండా కంటెస్టెంట్ల జీవిత విశేషాలు, వారితో సరదా సంభాషణలు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఆరాధ్య గుప్తా అనే యువకుడు తాజాగా కేబీసీ హాట్‌సీట్‌కు అర్హత సాధించాడు. ఎప్పటిలాగానే అతని జీవిత విశేషాలు తెలుసుకున్నారు బిగ్‌బీ. తనకు టీవీ జర్నలిస్ట్‌ కావాలని ఉందని ఆరాధ్య చెప్పడంతో తనను ఇంటర్వ్యూ చేయమని అమితాబ్‌ సరదాగా అడిగాడు. అప్పుడు ఆ యువకుడు.. ‘ అలెక్సా (అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్‌) కోసం మీ వాయిస్‌ను రికార్డ్‌ చేశారు కదా.. మరి ఇంట్లో జయా ఆంటీ.. ‘అలెక్సా.. స్విచ్ ఆన్ ది ఏసీ’ అని ఆర్డర్‌ వేస్తే .. ‘ యస్‌.. మేడమ్’ అని సమాధానమిస్తుందా’ అని అడిగాడు. ఈ ప్రశ్న వినగానే అమితాబ్‌ సైలెంట్‌ అయిపోయారు. కానీ గ్యాలరీల్లో ప్రేక్షకులు మాత్రం విరగబడి నవ్వారు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న బిగ్‌బీ.. ‘మా ఇంట్లో ఏసీకి అలెక్సాను కనెక్ట్‌ చేయలేదు. మాన్యువల్‌గానే ఏసీని వేసుకుంటాం’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆతర్వాత అమితాబ్‌ను మరికొన్ని ప్రశ్నలు అడిగాడు ఆరాధ్య. బిగ్‌బీ హైట్‌ను ఆధారంగా చేసుకుని ‘ మీరు చాలా పొడవుగా ఉన్నారు కదా…ఇంట్లో మీరే ఫ్యాన్లు శుభ్రం చేస్తారా’ అని యువకుడు అడగ్గానే ప్రేక్షకుల ముఖాల్లో మళ్లీ నవ్వులు విరబూశాయి. దీనికి సింపుల్‌గా ‘లేదు’ అని చెప్పిన అమితాబ్‌.. ‘నువ్వు చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నావ్‌.. ఇక చాలు’ అంటూ షోను ముందుకు తీసుకెళ్లారు..

Also Read:

చారడేసి కళ్ళు.. చక్కనైన చిరునవ్వు.. ఫొటోలోని ఈ క్యూటీ ఇప్పుడు క్రేజీ బ్యూటీ.. గుర్తుపట్టారా..

Venkatesh : నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో.. కానీ తప్పదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన వెంకీ..

Kangana Ranaut: బాలీవుడ్‌ క్వీన్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ మంత్రి.. సోషల్‌ మీడియాలో విమర్శించిన జావేద్‌ అక్తర్‌..

Published On - 10:42 am, Fri, 19 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu