Work From Home: కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కార్పొరేట్ ప్రపంచంపై మళ్లీ చూపుతోంది. కార్పొరేట్ కంపెనీలు మళ్ళీ నెమ్మదిగా ఇంటి నుంచి పనిని అమలు చేయడం ప్రారంభించాయి. గత వారం, ఫార్మా కంపెనీ సిప్లా ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పని చేయమని కోరింది. తదుపరి ఆర్డర్ వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇదే విధమైన ఆర్డర్‌ను జారీ చేసింది. మహీంద్రా & మహీంద్రా మ్యూచువల్ ఫండ్ వారంలో మూడు రోజులు ఆఫీస్‌నుంచి.. మరో మూడు రోజులు ఇంటి నుంచి పని చేసే నియమాన్ని అమలు చేసింది. కాగా వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
కరోనా మొదటి వేవ్ తర్వాత పలు కార్యాలయాలు ప్రారంభమవగా.. సెకండ్ వేవ్ ప్రారంభం అవడంతో మళ్లీ వాటిని మూసివేశాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది అనుకునే లోపు.. మళ్లీ థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కారణంగా.. మళ్ళీ ఆఫీసులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆర్పీజీ గ్రూప్, డాబర్ ఇండియా, మారికో, ఫ్లిప్‌కార్ట్, పార్లే, మేక్‌మైట్రిప్ వంటి కంపెనీలు కూడా రాబోయే రెండు మూడు నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుచేస్తున్నట్లు తెలిపాయి. చాలా వరకు టెక్ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి.
Also read:
Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్’..సొగసు చూడతరమా..!
IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!
Sara Ali Khan : లవ్ అంటూ ఇద్దరిని ముంచావ్.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)