అమెజాన్ సెల్లర్లకు కొత్త రూల్.. ఆ పేరు ఉండాల్సిందే..

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. భారత్‌లో బాయ్‌కాట్ చైనా నినాదం ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రతి సెల్లర్ తమ ప్రాడక్టులపై అది ఏ దేశానికి చెందిందో తప్పనిసరిగా సూచించాలని అమెజాన్ ఇండియా సెల్లర్లకు సూచించింది.

అమెజాన్ సెల్లర్లకు కొత్త రూల్.. ఆ పేరు ఉండాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 2:30 PM

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. భారత్‌లో బాయ్‌కాట్ చైనా నినాదం ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రతి సెల్లర్ తమ ప్రాడక్టులపై అది ఏ దేశానికి చెందిందో తప్పనిసరిగా సూచించాలని అమెజాన్ ఇండియా సెల్లర్లకు సూచించింది. ఆగస్టు 10లోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దీనిని అమలులోకి తీసుకురావాలని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ అధికారిక మెయిల్‌ను ఏఐఓవీఏ (ఆల్ ఇండియన్ ఆన్‌లైన్ వెన్డార్ అసోసియేషన్)కు పంపింది.

కాగా.. సదరు ప్రక్రియ మొత్తం జూలై 21 నుంచి ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని, గడువు అనంతరం ఉత్పత్తి చేసిన దేశం పేరులేని వస్తువులను అమ్మేందుకు ఏ సెల్లర్‌నూ అనుమతించేదిలేదని ఆ మెయిల్ ద్వారా ప్రకటించింది. అమ్మకందారులెవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తమ సెల్లర్ల జాబితా నుంచి కూడా తొలగించేస్తామని హెచ్చరించింది.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..