మూడు రాజధానుల సెగ.. రైతుల ముట్టడిలో ఏపీ సచివాలయం!

ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్‌కు చేరింది. సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులతో సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 8 వేల మంది పోలీసులు సచివాలయం చుట్టూ మోహరించినప్పటికీ.. రాజధాని రైతులు, మహిళలు వెనుకంజ వేయలేదు. పంట పొలాల్లో నుంచి దూసుకొచ్చి నాలుగు వైపులా దిగ్బంధనం చేశారు. తుళ్లూరు రైతులు సచివాలయం వెనుక గేటును ముట్టడి చేసేందుకు […]

మూడు రాజధానుల సెగ.. రైతుల ముట్టడిలో ఏపీ సచివాలయం!
Follow us

|

Updated on: Jan 20, 2020 | 1:22 PM

ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్‌కు చేరింది. సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులతో సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 8 వేల మంది పోలీసులు సచివాలయం చుట్టూ మోహరించినప్పటికీ.. రాజధాని రైతులు, మహిళలు వెనుకంజ వేయలేదు. పంట పొలాల్లో నుంచి దూసుకొచ్చి నాలుగు వైపులా దిగ్బంధనం చేశారు.

తుళ్లూరు రైతులు సచివాలయం వెనుక గేటును ముట్టడి చేసేందుకు యత్నించగా.. మల్కాపురం రైతులు ముందు గేటును.. శాఖమూరు, ఐనవోలు రైతులు కుడివైపు గేటును ముట్టడించారు. అటు రైతులను అడ్డుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా, పలుచోట్ల వారిని పోలీసులు లాఠీఛార్జ్ జరిపి చెదరగొట్టారు. దీనితో సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళలు నిరసనకు దిగారు.