హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

దివంగత నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య స్మారకార్థం హైదరాబాద్‌లో భారీ సినీ స్టూడియో నిర్మించాలని నిర్ణయించింది ఆయన కుటుంబం. అల్లు స్టూడియోస్ పేరిట హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించనున్నట్లు గురువారం..

హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ
Follow us

|

Updated on: Oct 01, 2020 | 2:07 PM

Allu family to construct cine studio in Hyderabad: దివంగత నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య స్మారకార్థం హైదరాబాద్‌లో భారీ సినీ స్టూడియో నిర్మించాలని నిర్ణయించింది ఆయన కుటుంబం. అల్లు స్టూడియోస్ పేరిట హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించనున్నట్లు గురువారం (అక్టోబర్ 1) అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబం ప్రకటించింది. అల్లు రామలింగయ్య ఫోటోకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన తనయుడు అల్లు అరవింద్, మనవలు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీశ్ సంయుక్తంగా భారీ సినీ స్టూడియో నిర్మించనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు సినీ స్టూడియోలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో తెలుగుతోపాటు పలు భాషల సినిమాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో పేరు గాంచిన పద్మాలయా, రామానాయుడు స్టూడియోల చుట్టూ ప్రస్తుతం భవన నిర్మాణాలు జరిగిన నివాస ప్రాంతాలుగా మారిపోయిన నేపథ్యంలో నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ సినిమా షూటింగులు జరుగుతున్నాయి. మరోవైపు నగరం నడి బొడ్డున వున్న అన్నపూర్ణ సినీ స్టూడియోస్‌, దానికి అనుబంధంగా అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన సెవెన్ ఎకర్స్ స్టూడియోస్‌లో సినిమాలతోపాటు టీవీ సీరియళ్ళు, టీవీ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున షూటింగులు జరుపుకుంటున్నాయి.

గురువారం సినీ స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రకటించిన అల్లు ఫ్యామిలీ.. దాన్ని ఎక్కడ నిర్మిస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. స్టూడియోస్ హైలైట్స్ గానీ… తీరు తెన్నులను గానీ ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రకటన వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

also read:  ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు