Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ఉన్నట్టా..లేనట్టా..?

స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన అల్లు అర్జున్‌.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా ఉన్నట్టా..లేనట్టా..?
Follow us

|

Updated on: May 16, 2021 | 10:52 PM

Allu Arjun : స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన అల్లు అర్జున్‌.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అన్న డిస్కషన్ మొదలైంది. కొరటాల శివతో ఎనౌన్స్‌ అయిన మూవీ ఇప్పట్లో లేకపోవడంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్‌.. నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారు..? మిగతా హీరోలంతా.. క్రేజీ మూవీస్‌ లైనప్ చేస్తుంటే బన్నీ నెక్ట్స్ మూవీ డైరెక్టర్‌ ఎవరు? ఇదే ఇప్పుడు ఫిలిం నగర్‌లో మేజర్‌ డిస్కషన్‌. ఆల్రెడీ పుష్ప షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఈ టైంలో కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు బన్నీ.  పుష్ఫ షూటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే నెక్ట్స్ కొరటాల శివతో సినిమా అంటూ ఎనౌన్స్ చేశారు అల్లు అర్జున్‌. కానీ సడన్‌గా కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి ఎన్టీఆర్‌తో సినిమా కమిట్ అయ్యారు. దీంతో బన్నీ మరో డైరెక్టర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి. పోనీ ఎన్టీఆర్ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేద్దామని బన్నీ అనుకున్నా కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ సారి బన్నీకి అడ్డు తగిలింది ఓ కుర్ర హీరో..  ఎవరో కాదు..అక్కినేని అఖిల్.

ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఒక సినిమాను అఖిల్ చేయబోతున్నాడు. ఏజెంట్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంకు పూర్తి చేసి ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు టాక్. ఇంతకు బన్నీతో కొరటాల శివతో సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానం అభిమానుల్లో మొదలైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akash Puri’s Romantic: ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకూడా ఓటీటీ బాట పట్టనుందా.?

Pawan Kalyan meets Harish Shankar: పవర్ స్టార్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడా..?

Bellamkonda Ganesh: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. హిందీ మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న గణేష్..