బాలీవుడ్ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్.. హీరో ఎవరంటే.!

బాలీవుడ్ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్.. హీరో ఎవరంటే.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో 'హీరోపంతి -2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సాజిద్ నడియాడ్‌వాలా సన్నాహాలు చేస్తున్నాడు.

Ravi Kiran

|

Aug 09, 2020 | 5:42 PM

Bollywood Movie Heropanti Sequel: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో ‘హీరోపంతి -2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సాజిద్ నడియాడ్‌వాలా సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. కథానుగుణంగా ఈ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని సాజిద్ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను అప్రోచ్ అయినట్లు వినికిడి. మరి బన్నీ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? లేదా అనేది వేచి చూడాలి.

కాగా, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పరుగు’ సినిమాను బాలీవుడ్‌లో ‘హీరోపంతి’గా రీమేక్ అయింది. ఈ సినిమా ద్వారానే టైగర్ ష్రాఫ్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందించేందుకు నిర్మాతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu