డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..

ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఆ మనీని మాత్రం రెండు వారాల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రవేశపెట్టిన ‘బుక్ నౌ పే లేటర్’ సర్వీసు ద్వారా ప్రయాణీకులకు ఎంతగానో ప్రయోజనం కలగనుంది. రైల్వేలో తరచుగా వెళ్తున్న వాళ్ళకి ఈ విధానం చాలా ఉయోగపడుతుంది. కాగా, ఈ సర్వీసు కోసం ఐఆర్‌సీటీసీ సంస్థ ‘ఈ పే […]

  • Ravi Kiran
  • Publish Date - 3:31 pm, Wed, 25 December 19
డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..

ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఆ మనీని మాత్రం రెండు వారాల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రవేశపెట్టిన ‘బుక్ నౌ పే లేటర్’ సర్వీసు ద్వారా ప్రయాణీకులకు ఎంతగానో ప్రయోజనం కలగనుంది. రైల్వేలో తరచుగా వెళ్తున్న వాళ్ళకి ఈ విధానం చాలా ఉయోగపడుతుంది. కాగా, ఈ సర్వీసు కోసం ఐఆర్‌సీటీసీ సంస్థ ‘ఈ పే లెటర్’ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

రైల్ టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ పే లేటర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్‌కు కూడా (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. అంతేకాకుండా ఈ మెయిల్, ప్యాన్ నెంబర్‌ను కూడా పొందుపరచాల్సి వస్తుంది. ఇక ఈ పే లేటర్‌ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాలి. పేమెంట్ ఆప్షన్ దగ్గర మాత్రం పే లేటర్ క్లిక్ చేస్తే చాలు. మీ టికెట్ బుక్ అయినట్లే. ఇక ‘ఈ పే లేటర్‌’ ఆప్షన్ ద్వారా టికెట్‌ బుక్ చేసుకున్న డబ్బులను రెండు వారాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి..