చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధి గ్రస్థులకు బత్తిన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం రేపు పంపిణీ చేయనున్నారు. రేపు సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమైన ఆదివారం సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్షా 60 వేల చేప పిల్లలు, నాలుగున్నర లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు […]

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 11:51 AM

చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధి గ్రస్థులకు బత్తిన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం రేపు పంపిణీ చేయనున్నారు. రేపు సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమైన ఆదివారం సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్షా 60 వేల చేప పిల్లలు, నాలుగున్నర లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం తీసుకునేందుకు తరలిరానున్నారు.