రసాబాసగా అఖిలపక్షం.. కాంగ్రెస్ వాకౌట్

మునిసిపల్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్లను వెల్లడించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్, బిజెపి సహా హాజరైన అన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారిని దుర్భాషలాడారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సంఘం […]

రసాబాసగా అఖిలపక్షం.. కాంగ్రెస్ వాకౌట్
Follow us

|

Updated on: Dec 31, 2019 | 8:14 AM

మునిసిపల్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్లను వెల్లడించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్, బిజెపి సహా హాజరైన అన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారిని దుర్భాషలాడారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన హాజరైన మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ రావు.. ముందుగా రిజర్వేషన్లను ప్రకటించాలని, వాటిపై అభ్యంతరాలు లేకుంటేనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కోరారు. ఈ విఙ్ఞప్తిని టీఆర్ఎస్, ఎంఐఎం ప్రతినిధులు మినహా మిగిలిన అందరూ ఎన్నికల అధికారి ముందుంచారు. ఎన్నికల షెడ్యూల్ మార్చి, సంక్రాంతి పండగ తర్వాత తాజా షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు.

అయితే, ఎన్నికల షెడ్యూల్ ఇదివరకే ప్రకటించినందున దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నాగిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ నాగిరెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు పెట్టడం మొదటిసారి చూస్తున్నామంటూ సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణలకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తిప్పి కొట్టారు. అఖిలపక్షానికి హాజరైన టీఆర్ఎస్ నేతలు గట్టు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. అధికారులను తిడతామంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రతిపక్షాల్లో అప్పుడే ఓటమి భయం కనపడుతుందని అన్నారాయన.

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్