అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

తెలంగాణలో పలు జిల్లాల్లో కిడ్నీవ్యాధులతో మంచాన పడుతున్న విషయం తెలిసిందే. వీరికి సరైన వైద్యం అందక, ఒకవేళ వైద్యం చేయించుకోవాలని అనుకున్నా ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. స్వయానా తన తండ్రిని కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే సునీత. ఆ సమయంలో తాము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున వైద్యం చేయించేందుకు కూడా డబ్బులు లేకపోయాయంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది ఎంతో మంది బాధపడతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 20, 2019 | 8:31 PM

తెలంగాణలో పలు జిల్లాల్లో కిడ్నీవ్యాధులతో మంచాన పడుతున్న విషయం తెలిసిందే. వీరికి సరైన వైద్యం అందక, ఒకవేళ వైద్యం చేయించుకోవాలని అనుకున్నా ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. స్వయానా తన తండ్రిని కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే సునీత. ఆ సమయంలో తాము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున వైద్యం చేయించేందుకు కూడా డబ్బులు లేకపోయాయంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది ఎంతో మంది బాధపడతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఎయిడ్స్, పైలేరియా రోగులకు ఇస్తున్నట్టుగా కిడ్నీ రోగులకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని సునీత ప్రభుత్వాన్ని కోరారు.

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న పదివేలమందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామని, వీరికి ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులను మెరుగైన వైద్యాన్ని అందించేందుకు డయాలసిస్ సెంటర్లు పెంచే ఆలోచన ఉందన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu