గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నాగ చైతన్య
తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నందు రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన నాగ చైతన్య.. తన ఇంటిలో ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దర్శకుడు విక్రమ్ కే.కుమార్..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
నందు రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన నాగ చైతన్య.. తన ఇంటిలో ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దర్శకుడు విక్రమ్ కే.కుమార్, సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు శివ నిర్వాణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు నాగ చైతన్య. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు నాగ చైతన్య.
Thank you @nandureddy4u for nominating me ! Here’s to a greener future..I nominate @Vikram_K_Kumar @iamSushanthA @ShivaNirvana @Rakulpreet to keep this going ! Thoughtful initiative by @MPsantoshtrs .. #GreenIndiaChallenge #HaraHaiTohBharaHai pic.twitter.com/vFZie4hzOg
— chaitanya akkineni (@chay_akkineni) August 17, 2020
Also Read:
సినీ నటి మాధవిలతపై కేసు నమోదు