కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా..!

ఎన్డీయే ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. రైతులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నిరసన సెగ తగిలింది. ఈ బిల్లుకు నిరసనగా మంత్రి పదవి వదులుకోవాలని అకాలీదళ్‌ నిర్ణయించుకుంది. లోక్‌సభలోనే పార్టీ నిర్ణయాన్ని...

  • Sanjay Kasula
  • Publish Date - 8:39 pm, Thu, 17 September 20
కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా..!

Harsimrat Kaur Badal resign : ఎన్డీయే ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. రైతులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నిరసన సెగ తగిలింది. ఈ బిల్లుకు నిరసనగా మంత్రి పదవి వదులుకోవాలని అకాలీదళ్‌ నిర్ణయించుకుంది. లోక్‌సభలోనే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌సింగ్‌. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా సమర్పించారు.

ప్రధాని కార్యాలయానికి చేరుకొని ఆమె రాజీనామా సమర్పించారు హర్‌సిమ్రత్‌. ఇప్పటివరకు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిగా ఉన్నారామె. వ్యవసాయ సంబంధ బిల్లులను శిరోమణి అకాలీదళ్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. అయితే తాజా రాజీనామాతో ఎన్డీయేలో ముసలం బయటపడింది. తమ నిర్ణయాన్ని అకాలీదళ్‌ సమర్థించుకుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన కేంద్రం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సమర్థించాల్సిన అవసరం లేదన్నారు అకాలీదళ్‌ నేత బల్విందర్‌సింగ్‌.