షూటింగ్ ప్రారంభించనున్న ‘తలా’ అజిత్..!

'తలా' అజిత్ కుమార్.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు.

  • Ravi Kiran
  • Publish Date - 9:08 pm, Fri, 31 July 20
షూటింగ్ ప్రారంభించనున్న 'తలా' అజిత్..!

Ajith To Start Valamai Shooting: ‘తలా’ అజిత్ కుమార్.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ ‘నిర్కొండ పార్వై’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్ ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లాక్ డౌన్ ముందు హైదరాబాద్‌లో 40 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. కరోనా విరామం తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఆర్‌ఎఫ్‌సీలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ముందుగా నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్.. కరోనా కారణంగా వాయిదా వేసే ఛాన్స్ కనిపిస్తోంది.