ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు గుడ్ న్యూస్..

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు గుడ్ న్యూస్..

బ్రాడ్‌బ్యాండ్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ అందించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిషన్‌ను...

Ravi Kiran

|

Nov 03, 2020 | 11:59 AM

Airtel Broadband: బ్రాడ్‌బ్యాండ్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ అందించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిషన్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అలాగే థ్యాంక్స్ యాప్ ద్వారా ఆ ఆఫర్‌కు మీరు అర్హులో.. కాదో తెలుసుకోవచ్చునని సూచించింది. మరోవైపు రూ. 999 ఆపైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు, రూ. 499 ఆపైన పోస్టుపెయిడ్ వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తమ కస్టమర్లకు రెండు సబ్‌స్క్రిషన్లు అందిస్తోంది. వీఐపీ అకౌంట్ తీసుకున్నవారు ఏడాదికి రూ. 399 చెల్లించాల్సి ఉండగా.. ప్రీమియం అకౌంట్ వారు సంవత్సరానికి రూ. 1,499 చెల్లించాలి.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu