ఇన్సూరెన్స్ కవరేజ్‌తో .. ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఆదివారం ప్రకటించింది. ”రూ.179 ప్లాన్‌ గడువు 28 రోజులు. 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందించే జీవిత బీమా ఈ ప్యాక్‌తో పాటు లభిస్తాయి” అని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను, సెమీ అర్బన్, గ్రామీణ […]

ఇన్సూరెన్స్ కవరేజ్‌తో .. ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:51 PM

దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ఆదివారం ప్రకటించింది. ”రూ.179 ప్లాన్‌ గడువు 28 రోజులు. 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందించే జీవిత బీమా ఈ ప్యాక్‌తో పాటు లభిస్తాయి” అని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను, సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో ఫీచర్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18-54 వయస్సు కలిగిన వారికి జీవిత బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ఎలాంటి పత్రాలు గానీ, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదని ఎయిర్‌టెల్‌ తెలిపింది. బీమాకు సంబంధించిన పాలసీ పత్రాలను తక్షణమే డిజిటల్‌ రూపంలో పంపిస్తామని, అవసరమైతే కాగితం రూపంలోనూ అందిస్తామని పేర్కొంది. జీవిత బీమాతో కూడిన ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లకు అనూహ్య స్పందన వస్తోందని కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశ్వంత్‌ శర్మ పేర్కొన్నారు.

ఈ భీమా  18-54 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లకు అందుబాటులో ఉంది.  ఈ బీమా పొందడానికి డాక్యుమెంట్లు, ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.