కేరళ విమాన ప్రమాదం: పైలట్ సాథే అప్రమత్తతే భారీ ప్రాణ నష్టాన్ని తప్పించింది.!

కేరళ విమాన ప్రమాదం: పైలట్ సాథే అప్రమత్తతే భారీ ప్రాణ నష్టాన్ని తప్పించింది.!

ల్యాండింగ్ గేర్‌లోని లోపాన్ని ముందుగానే గ్రహించి అప్రమత్తమైన పైలట్ దీపక్ సాథే.. విమానాన్ని ఎయిర్ పోర్టు చుట్టూ మూడు రౌండ్లు తిప్పారని.. తద్వారా ఇంధన ట్యాంకులు ఖాళీ అయ్యాయని..

Ravi Kiran

|

Aug 09, 2020 | 10:46 PM

Air India crash: మరికొన్ని నిమిషాల్లో చనిపోతామని గ్రహించినా.. బెదరలేదు, భయపడలేదు. తన గురించి కంటే.. విమానంలో ఉన్న ప్రయాణీకుల గురించి అలోచించి.. వారిని కాపాడేందుకు సాటిలేని పైలట్ దీపక్ సాథే చేసిన చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని ఆయన బంధువు అయిన నీలేష్ సాథే ఫేస్‌బుక్‌ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.

కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ‘ఎయిర్ ఇండియా’ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. వందేమాతరం మిషన్‌లో భాగంగా ఈ విమానం దుబాయ్‌ నుంచి కేరళకు 190 మంది ప్రయాణీకులను తీసుకొస్తుండగా.. ల్యాండింగ్‌లో ఇబ్బంది ఏర్పడటంతో రన్‌వే చివరి లోయలో పడి రెండు ముక్కలైంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. మిగిలిన ప్రయాణీకులు గాయాలతో బయటపడ్డారు.

ల్యాండింగ్ గేర్‌లోని లోపాన్ని ముందుగానే గ్రహించి అప్రమత్తమైన పైలట్ దీపక్ సాథే.. విమానాన్ని ఎయిర్ పోర్టు చుట్టూ మూడు రౌండ్లు తిప్పారని.. తద్వారా ఇంధన ట్యాంకులు ఖాళీ అయ్యాయని.. అంతేకాకుండా ఆయన ఇంజిన్లను కూడా సకాలంలో ఆఫ్ చేయడం వల్ల ఈ లోహ విహంగానికి మంటలు అంటుకోలేదని అతడి కజిన్ నీలేష్ సాథే తెలిపారు. దీని వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకొచ్చారు.

దీపక్ సాతే బంధువైన నీలేష్ సాతే దీని గురించి ఫేస్‌బుక్‌లో హృదయపూర్వక పోస్ట్ రాశారు…

ల్యాండింగ్ గేర్లు పని చేయలేదు… మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇంధనాన్ని ఖాళీ చేయడం కోసం మూడు రౌండ్లు విమానాశ్రయాన్ని చుట్టాడు. దీని వల్లే విమానం క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు మంటలు ఎగిసిపడలేదు. ఎక్కడా కూడా పొగలేదు. అంతేకాకుండా క్రాష్ అయ్యే ముందే అతను ఇంజిన్‌ను కూడా ఆపేశాడు. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినా.. అతని ముందుగానే అప్రమత్తం కావడం వల్ల 180 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. దీపక్ సాతే.. 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఏస్ పైలట్‌గా పని చేశారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) గ్రాడ్యుయేట్. అంతేకాకుండా ఆయనకు ”Sword of Honour” కూడా లభించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu