ఢిల్లీలో ‘కూర్చుని వ్యవసాయం చేస్తామంటే ఎలా ?’ కేంద్రంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సెటైర్, మేం చేసినట్టు చేయాలనీ సూచన

ఢిల్లీలో కూర్చుని 'వ్యవసాయం సాగించలేమని  ఎన్సీపీ నేత, మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయిన శరద్ పవార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, రైతులతో చర్చించకుండా వివాదాస్పద చట్టాలను  తెచ్చిందన్నారు.

ఢిల్లీలో 'కూర్చుని వ్యవసాయం చేస్తామంటే ఎలా ?'  కేంద్రంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సెటైర్, మేం చేసినట్టు చేయాలనీ సూచన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 10:03 PM

ఢిల్లీలో కూర్చుని ‘వ్యవసాయం సాగించలేమని  ఎన్సీపీ నేత, మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయిన శరద్ పవార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, రైతులతో చర్చించకుండా వివాదాస్పద చట్టాలను  తెచ్చిందన్నారు. సుదూరపు గ్రామాల్లో అన్నదాతలు వ్యవసాయం చేస్తుంటే ఢిల్లీలో కూర్చుని ‘వ్యవసాయం చేస్తారా’ అని ఆయన సెటైర్ వేశారు. రైతులతో చర్చల కోసం ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేసిందని, కానీ వారి బదులు ఈ రంగంలో అనుభవజ్ఞులైన, రైతుల సమస్యల గురించి బాగా తెలిసిన వ్యక్తులను నియమించాల్సి ఉండిందని శరద్ పవార్ పేర్కొన్నారు. అన్నదాతల ఆందోళనను విపక్షాలు రెచ్ఛగొడ్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. అన్నదాతల సమస్యను కేంద్రం పరిష్కరించలేకపోతే ఏం చేయాలన్నదానిపై విపక్షాలు రేపు కూర్చుని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని పవార్ తెలిపారు. ఒకప్పుడు తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అన్ని రాష్ట్రాలు, రైతు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని అయన గుర్తు చేశారు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు