లాక్-డౌన్ కాగానే ఫస్ట్ వెళ్ళేది అక్కడికే.. జంకేది లేదన్న బండి

కరోనా ఒకవైపు తెలంగాణలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే.. లాక్ డౌన్ ముగిసిన వెంటనే తాను ఎక్కడికెళతానో చెబుతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అక్కడికెళ్ళి బాధితులకు ధైర్యం చెప్పడమే తన లక్ష్యమని అంటున్నారయన.

లాక్-డౌన్ కాగానే ఫస్ట్ వెళ్ళేది అక్కడికే.. జంకేది లేదన్న బండి
Follow us

|

Updated on: Apr 13, 2020 | 2:35 PM

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి అవడానికి ఇంకా చాలా సమయం పడుతుందంటున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో మాస్కుల కొరత తీవ్రంగా వుందని, దాన్ని నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కట్టడి అవుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో తబ్లిఘీ జమాత్ వర్కర్ల నిర్లక్ష్యం వైరస్ వ్యాప్తికి కారణమైందని సంజయ్ అంటున్నారు.

తెలంగాణాలోని అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లకు పీపీఈ కిట్ల కొరత ఉందని, గాంధీ ఆసుపత్రి నుంచి చాలా మంది డాక్టర్లు తమకు కిట్లపై ఫిర్యాదు చేస్తున్నారని సంజయ్ అంటున్నారు. ఐసోలేషన్ లేదా క్వారంటైన్‌లో ఉన్న పేషంట్స్‌కు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని సంజయ్ విమర్శించారు.

తొలి పర్యటన అక్కడికే…

రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తైన అనంతరం మొదటి పర్యటన భైంసాకే వెళతానంటున్నారు బండి సంజయ్. భైంసా గొడవల తరువాత బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉండేందుకు గూడు కూడా లేకుండా పోయిందని సంజయ్ అన్నారు. వారిని ఆదుకోవడంపై కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని, సేవ భారత్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా సరుకులు అందజేశామని తెలిపారు. గొడవల్లో ఇరవై కుటుంబాలు సర్వం కోల్పోయాయని, వారందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామనన్నారు. బాధితులను వ్యక్తిగతంగా కలిస్తే వారిలో ధైర్యం నింపిన వాడిని అవుతానని, అందుకే లాక్ డౌన్ ముగిసిన వెంటనే భైంసా వెళ్ళాలని భావిస్తున్నానని అంటున్నారు బండి సంజయ్.