టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ లేదు… కోర్టుకు అఫిడవిట్‌!

హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కోన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి నిధులు కేటాయించామని అధికారులు వివరించారు. కోర్టు ఆదేశాలతో ఆయా విభాగాల ఉన్నతాధికారులు నేడు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి […]

టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ లేదు... కోర్టుకు అఫిడవిట్‌!
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Nov 06, 2019 | 8:18 PM

హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కోన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి నిధులు కేటాయించామని అధికారులు వివరించారు.

కోర్టు ఆదేశాలతో ఆయా విభాగాల ఉన్నతాధికారులు నేడు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయాలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు తెలిపారు. ఆర్టీసికి 3006 కోట్ల బకాయిలు ఉండగా… ప్రభుత్వం 3903 కోట్లు చెల్లించిందని చెప్పారు. దీనికి అదనంగా ఆర్టీసీయే తిరిగి మోటారు వాహనాల చట్టం కింద 540 కోట్లు చెల్లించాలని అఫిడవిట్‌లో పేర్కోన్నారు.

ఆర్టీసీ బకాయిలపై జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్‌కుమార్‌ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే 2018-19 సంవత్సరానికి గాను ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు లేవని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే నిధులు ఇస్తున్నామని పేర్కోన్నారు. 2014-15 మిగులు బడ్జెట్ ఉండడం వల్ల ఆర్టీసీకి నిధులు ఇచ్చామని అనంతరం జీహెచ్‌ఎంసీ కూడ లోటుబడ్జెట్‌లో ఉండడంతో నిధులు ఇవ్వడం లేదని తెలిపారు.

అయితే ఆర్టీసీ ఎండీ సునిల్‌శర్మ రవాణశాఖ మంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కోన్న అంశాలు విరుద్దంగా ఉన్నాయని చెప్పడంతో, అందుకు సంబంధించిన వివరాలు సునిల్ శర్మ సైతం అఫిడవిట్‌ను కోర్టుకు అందించారు. ప్రభుత్వం నుండి ఎక్కువ నిధులు రాబట్టాలనే ఉద్దెశ్యంతోనే రవాణాశాఖ మంత్రికి ఆ నివేదిక ఇచ్చామని పేర్కోన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులకంటే అదనంగా 867 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇక ఉన్నతాధికారులు సమర్పించిన అఫిడవిట్‌లపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉదయం మంత్రితోపాటు అధికారులు సమావేశం అయి కోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై చర్చించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu