మాధవీలతకి.. శ్రీరెడ్డి ‘ఆర్‌ఐపీ’! ఇంకా పోలేదా అంటూ పోస్ట్!

‘త్వరలోనే నేను చచ్చిపోతా అంటూ టాలీవుడ్‌ హీరోయిన్ మాధవీ లత షాకింగ్ పోస్ట్ చేసిన’ సంగతి తెలిసిందే. నేను కూడా ‘ప్రేమ’ సినిమాలోని రేవతిలాగా చచ్చిపోతాను అంటూ కామెంట్స్‌ చేయడం.. ఆమె ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదోఒక హెల్త్ గురించి ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి […]

మాధవీలతకి.. శ్రీరెడ్డి 'ఆర్‌ఐపీ'! ఇంకా పోలేదా అంటూ పోస్ట్!

‘త్వరలోనే నేను చచ్చిపోతా అంటూ టాలీవుడ్‌ హీరోయిన్ మాధవీ లత షాకింగ్ పోస్ట్ చేసిన’ సంగతి తెలిసిందే. నేను కూడా ‘ప్రేమ’ సినిమాలోని రేవతిలాగా చచ్చిపోతాను అంటూ కామెంట్స్‌ చేయడం.. ఆమె ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదోఒక హెల్త్ గురించి ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని’ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌ చేసింది.

అనంతరం ఒకేసారి నెటిజన్ల నుంచి కామెంట్స్ వెల్లువెత్తడంతో.. ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. నేనేదో క్యాజువల్‌గా పెట్టాను అంతే.. నేనేం చనిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇప్పుడు ఇదే విషయంపై ఫైర్‌ బ్రాండ్ శ్రీరెడ్డి స్పందించింది.

‘ఆర్‌ఐపీ మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో.. నెట్టింట మళ్లీ రచ్చ మొదలైంది. ఆమె బతికే ఉంది కానీ.. నువ్వు పోవచ్చు కదా, ఒక అమ్మాయి గురించి అలా కామెంట్స్ చేయడం తప్పు శ్రీరెడ్డి.. అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

Published On - 4:02 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu