ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు  నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలోని పంచాయితీ రాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఈఈ కార్యాల‌యంలో ప‌లు రికార్డులు పరిశీలిస్తున్నారు.

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
Follow us

|

Updated on: Sep 08, 2020 | 4:54 PM

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు  నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలోని పంచాయితీ రాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఈఈ కార్యాల‌యంలో ప‌లు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవ‌ల బిల్లు చెల్లింపులు చేసిన నాడు-నేడు, గ్రామ‌స‌చివాల‌య ప‌నుల‌కు సంబంధించిన ఎం.బుక్ లు, బిల్లు చెల్లింపులను, వాస్త‌వ ప‌నుల‌తో స‌రిపోల్చుతున్నారు.

మ‌రో వైపు ఆమ‌దాల‌వ‌ల‌స రోడ్లు, భ‌వ‌నాల శాఖ డీఈ కార్యాల‌యంలో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి. గ‌త రెండేళ్ల కాలంలో జ‌రిగిన ప‌నులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు.

అదేవిధంగా ఆత్మకూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఫ్యాక్టరీస్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రామచంద్రవరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..